Monday 25 May 2015

కిం కర్తవ్యం

కిం కర్తవ్యం,,,,?


స్వార్ధం చెలియలికట్ట దాటి,సమాజాన్ని ముంచేస్తున్న వేళ,
కత్తిసాములతో,గొడ్డళ్ళ విన్యాసాలతో,క్రౌర్యం విలయతాండవం చేస్తున్నవేల,
స్త్రీలు,వృద్దులు,పిల్లలని కూడా చూడక,చిత్రహింసల పాల్చేస్తున్నవేల,
మంచితనం,మానవత్వం,మరుగునపడి,
మాయమాటలు,మోసపుచేతలతో,
గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరుకుతూ,జీవనపరమావధి మరచిపోతున్నవేల,
అమానుశశక్తులు అకస్మాత్తుగా
రక్తదాహం,నరమేధం,కోరుతున్నవేల,
ఎక్కుతున్న మెట్లకి పాకుడుపట్టి,
అధఃపాతాళానికిజారుతున్నవేల,
మానవుడే దానవుడిగా రూపాంతరం చెంది,
లోక దహన కాండకు ఆయుత్తమైనవేల,,
యంత్రాలకూ,మంత్రాలకూ ప్రాధాన్యమిస్తూ,
సాటిమనిషి మనసుని,నిర్లక్ష్యం చేస్తున్నవేల,,
ఎవడోవచ్చి రక్షిస్తాడని ఎదురుచూస్తూ,,,,
కాపాడే వారే కాటేస్తారనే భీతితో ,,
మతమౌద్యాలకిది మరో రూపమనీ,,
రాజకీయచదరంగంలోనశించే పావులమనీ,
నిరాశా,నిస్పృహలకు  లోనయ్యే సమయం కాదిది,
స్వార్ధపు పునాది పడకుండా చూసే ముందుచూపు,,
వ్యామోహపు కలుపు మొక్కల్ని ఎరిపారేసే నేర్పు,
దుండగుల నెదిరించే ధైర్యం,కిరాతకాన్ని రూపుమాపే శౌర్యం కావాలి నేడు,
ప్రతి యువతా ఒక అభేద్య దుర్గమై,ప్రతి హస్తం దుర్మార్గాన్ని,దునుమాడే ఖడ్గమై,
కర్తవ్యదీక్షా పరతంత్రులమై నిలవాలి నేడు,
బద్ధకాలు,ప్రలోభాలువీడి,ఆత్మసంరక్షనార్ధం,,
లోకకళ్యానార్ధం,దీక్షాకంకన బదులమై,నిలవాలినేడు,,
రంగులవెంట పరుగులిడకుండా,
మనిషి మృగంకాకుండా,దైవత్వం పెంచుకునే దీక్ష పూనాలి నేడు.!!

1 comment:

  1. చాలా భారంగా వుంది. బాగా రాసావు.

    ReplyDelete