Saturday 24 September 2016

ఉండ్రాళ్ళతద్దె నోము ఉద్యాపన.

సెప్టెంబర్ 19 న కొండా పుర్లో మా కోడలు రాజ్యలక్ష్మి   ఉండ్రాళ్ళ తద్దె నోము ఉద్యాపన చేసుకున్నది.
క్రితం రోజే ఐదుగురు ముత్తైదువలు  వచ్చారు.సాయంత్రం అందరికి రాజ్యలక్ష్మి గోరింటాకు పెట్టింది.భోజనాలు చేసి పడుకున్నారు.తెల్లవారుజామున లేచి నలుగు పెట్టుకుని తలంట్లు పోసుకున్నారు.అందరికి బాత్రూంలో నూనె సున్నిపిండి,షాంపూలు పెట్టింది.
వాళ్ళ స్నానాలు అయేసరికే రాజ్యలక్ష్మి పూజ అయింది.
ఆ ఐదుగురికి  గొంగూరపచ్చ డి ,,కంది పచ్చడి ,పొట్లకాయ పెరుగుపచ్చడి వేసి అన్నం పెట్టింది.సూర్యోదయం కాకమునుపే తినేయ్యాలి.
ఆ తర్వాతా అందర్నీ ఉయ్యలలూపింది.,దాంతో పార్ట్-1 అయింది.
మళ్ళీతను వాళ్ళమ్మ స్నాన్నలు చేసి మడి తో వంట  చేసారు.పిల్లలకి పరిక్షలు.వాళ్ళని తాయారు చేసి బాక్స్ లు కట్టి బళ్ళో దించి వచ్చింది.
ఐదుగురు ముత్తైదువులు మల్లి స్నానం చేసి,లలితాసహస్రం చదివారు.
రాజ్యలక్ష్మి పునః పూజ చేసి,కధ చదివి, మహా నైవేద్యం పెట్టింది.
ఆ ఐదుగురు ముత్తైడువులకి సుమంగళి పూజ చేసింది.పూర్ణం బూరెల వాయనం ఇచ్చింది .
కాళ్ళకి పసుపు రాసి,బట్టు పెట్టి గంధంరాసింది.
వాళ్లకి చీరలు పెట్టి,ఆశీస్సులు తీసుకుంది.
అందరికి పంచభక్ష,పరావాన్నాలతో భోజనం పెట్టింది.తాంబూలం వేసుకుని కబుర్లు చెప్పుకుని,ఆనందోత్సాహాలతో,ఆమెని వేనోళ్ళ కొనియాడుతూ,ఆశీస్సులన్దిస్తూ,
అందరూ,సెలవ తీసుకున్నారు.