Tuesday, 30 June 2015

జీవనశిల్పి...

జీవనశిల్పి
నీతలపు, మండుటెడారిలో మధుర ఫలతరువై,
నీపిలుపు,హృదయవీణ తంత్రులు మీటిన దివ్య ఓంకార నాదమై,
నీ చూపు,అనురాగ ఝల్లులు కురిపించు అమ్మయై,
నీ శిక్షణ, జ్ఞానాంబుధిని చిలకమన్న కవ్వమై,
నీ సందేశం, సంసారసాగరాన్ని దాటించి,
సుదూర తీరాల్ని చేర్చు చుక్కానియై,అ
నన్ను తీర్చిదిద్దిన నాన్నా,,
భవిష్యత్తు చిటికెన వేలూని నిను వీడివెల్తున్నవేళ,
జీవనప్రవాహ ప్రస్తానంలో నావనై తరలినవేళ,
నీ అప్యాయతకిదూరమౌతున్నానని విలవిల్లాడాను,
కానీ నాన్నా,,
నాల్గు వేదాల సంపుటి అయి ,,నీ నాల్గు వేళ్ళు అద్దిన చోట,
ఇక కన్నీటి జాడ లేదు,
బ్రతుకు బెదిరించిన వేళా,,ఆపదలు అలముకున్న వేళా,,
వెన్ను తట్టి నిలబెట్టింది నీ తలపే.
బేలతనం నాకెదురైన వేళ,నీ తలపు ఖడ్గమై కదను తొక్కుతోంది.
నీ ఓదార్పు  గురూపదేశ లేపనమై,
ఎదకు తాకిన గాయాల్ని మాన్పింది.
పాలు,నీళ్ళు,వేరు చేసే హంసలా నన్ను తీర్చిదిద్దిన పంచశీలమూర్తివి,
నీ ఆశీర్వాదాన్ని,నా రక్షణ కవచంగా ధరించి,గమ్యం వైపు పయనిస్తున్నా,,,,,!!!!!!!!!


No comments:

Post a Comment