సత్యన్వేషనకై తరలిన శ్వాస
విశ్వమంతా నిండిన ప్రానవాయువుని కలిసి
ప్రవాసానంతరం తన వారిని కలిసిన
ఆనందానుభూతి పొందింది కాబోలు,
పాత్రానుగత ప్రారభ్డ మనుభవించి ,
ప్రాకృతాల కర్మ ఫలానుభూతి చెంది,
ప్రలోభాల పద్మవ్యుహాల చిక్కి,
అనుబంధాల పాశాల బంధింపబడి,
బాధ్యతల బంగారు బంధాల బిగిసి,
పడుగు పేకలైన పాప పుణ్యాల వలలో చిక్కి,,
అతి ప్రయాసతో బంధవిముక్తయై,,
స్వేచ్ఛావిహంగమై,,,
సత్యాన్వేషణ కై తరలింది శ్వాస!!!!!!!!
No comments:
Post a Comment